ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌లో హింసాత్మక ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 23 మంది నిరసనకారులు మరణించారు. దాదాపు నాలుగు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాకీ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటన వెలువడిన తరువాత ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లో యుద్ద వాతావరణం కనిపిస్తోంది. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ఇరాకీ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. అత్యంత భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను సోమవారం (పార్లమెంటు భవనం) నిరసన కారులు ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో కొత్త మంది నిరసనకారులు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీలతో కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో నిరసనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు.. టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లను కాల్చడం ప్రయోగించారు. దీంతో నిరసన ప్రదర్శనలు కాస్త అదుపులోకి వచ్చాయి. గ్రీన్ జోన్ నుండి బయటకు తరిమేశాయని పలువురు సాక్షులు చెప్పారు. అల్-సదర్ ప్రకటన తర్వాత వందలాది మంది నిరసనకారులు గ్రీన్ జోన్‌లోని భవనంపైకి దూసుకెళ్లారని ఇరాక్ భద్రతా అధికారులు తెలిపారు.
ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 23 మంది నిరసనకారులు మరణించారు. దాదాపు నాలుగు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే మంగళవారం ఉదయం మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ భవనాలు, దౌత్య కార్యకలాపాలను కలిగి ఉన్న హై-సెక్యూరిటీ గ్రీన్ జోన్ నుండి బాగ్దాద్ అంతటా ఆటోమేటిక్ వెపన్, రాకెట్ కాల్పులు ప్రతిధ్వనించాయని పలు మీడియా సంస్థల ప్రతినిధులు నివేదించారు.
గత కొంతకాలంగా.. ఇరాక్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. నూతన ప్రధాని, అధ్యక్షుడు లేకపోవడంతో తాత్కాలిక ప్రధాని మస్తఫా అల్ ఖదేమీ ఆధ్వర్యంలో దేశ పరిపాలన సాగుతోంది. గత కొద్ది నెలల కిత్రం ఎన్నికల జరిగినా.. ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయాయి. దీంతో ప్రో- ఇరాక్ కో- ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి.. ఓ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రధానిగా ముస్తఫా అల్ ఖదేమీని నియమించబడ్డారు. కానీ, ఇరాకీ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో పలుసార్లు గ్రీన్ జోన్ ను ముట్టడికి ప్రయత్నించారు.
