ప్రతీకారం.. అమెరికా ఎంబసీ పై ఇరాన్ రాకెట్ దాడి

 గ్రీన్ జోన్ లోపల రెండు క్రత్యూష రాకెట్లు పడి ఉన్నాయని ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్ లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు.

2 Rockets Hit Iraq Capital Baghdad's Green Zone, Day After Iran Attack

ఇరాన్ ప్రతికారం తీర్చుకోవడం కోసం రగిలిపోతోంది. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80మంది సైనికులను మట్టుపెట్టామని ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజే.. మరో దాడి చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని గ్రీన్ జోన్ ను రెండు రాకెట్లు తాకాయి. యూఎస్ ఎంబసీకి సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన గ్రీన్ జోన్ లో రాకెట్ దాడి జరిగింది. 

గ్రీన్ జోన్ లో యూఎస్ ఎంబసీతోపాటు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. గ్రీన్ జోన్ లోపల రెండు క్రత్యూష రాకెట్లు పడి ఉన్నాయని ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇరాక్ లోని అమెరికా సైన్యం, కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ మరిన్ని దాడులకు తెగబడే అవకాశముందని భావిస్తున్నారు. అమెరికా సైన్యం పశ్చిమాసియాను విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. 

Also Read: అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి: కీలక ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

మరోవైపు, బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, సైనిక స్థావరాలపై దాడి వెనుక ఇరాక్‌ సైన్యానికి చెందిన హషేద్ గ్రూప్ ప్రమేయం కూడా ఉన్నట్టు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. అమెరికా రాకెట్ దాడిలో చినోయిన ముహుదీస్ హషేద్‌కు డిప్యూటీ చీఫ్‌గా ఉండటమే దీనికి కారణం. ఇదిలా ఉండగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాని హషేద్ హెచ్చరించడం విశేషం.

అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన ఉగ్రవాది, పారామిలిటరీ చీఫ్ ఖైస్ అల్ ఖజాలీ మాట్లాడుతూ.. ఇరాక్ ప్రతిస్పందన ఇరాన్ కంటే తక్కువ కాదని, అమెరికాకు దానికి మించి చూపిస్తామని అన్నారు. హషేద్ సానుభూతిపరులైన హర్కత్ అల్ నుజాబ్ సైతం అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా సైనికులారా మీరు కళ్లు మూసుకోకండి.. మీ చివరి సైనికుడు ప్రాణాలు తీసేవరకు అమరుడు ముహందీస్ చావుకు ఇరాకీలు ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించింది.

Also Read:  ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో మిస్టరీ: ఇరాన్, అమెరికాపైనే అనుమానాలు..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios