అమెరికా: అమెరికాలోని పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరం వద్ద ఓ సెయిలర్ విధ్వసం సృష్టించాడు. ఇద్దరిని కాల్చి చంపాడు. అనంతరం తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. 

ఇకపోతే కాల్పుల్లో మరణించిన ఇద్దరు రక్షణ శాఖలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే తనుకు తాను కాల్చుకున్న సెయిలర్ ప్రస్తుతం ఆస్పత్రిలో ఆపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కాల్పులు జరిపిన వ్యక్తి అమెరికాకు చెందిన సెయిలర్ గా పోలీసులు నిర్థారించారు. బుధవారం మధ్యాహ్నాం 2.30గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు నిర్ధారించారు. ఇకపోతే సెయిలర్ కాల్పులు జరగకముందు ముగ్గురు రక్షణ శాఖ అధికారులతోపాటు ఒక పౌరుడిని గాయపరిచాడని అనంతరం తనకు తాను కాల్చుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై నావీ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. 

రెప్పపాటులోనే ఇద్దర్నీ కాల్చి తాను కాల్చుకున్నాడని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తెలిపారు. తాను కంప్యూటర్ చూస్తుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించిందని లేచి చూసే సరికి ఇద్దరు చనిపోయి ఉన్నారని తెలిపారు. 

అమెరికా నౌకాద‌ళ సైన్యానికి పెర‌ల్ హార్బ‌ర్ కేంద్రంగా ఉన్న‌ది. ఇక్క‌డ భారీ నౌక‌ల‌కు రిపేర్‌, మెయింటేన్ చేస్తారు. వాటిని ఆధునీక‌రిస్తారు. పెర‌ల్ హార్బ‌ర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయ‌ర్లు, 15 స‌బ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో జ‌పాన్ దాడి చేసింది ఈ నాకౌశ్ర‌యంపైనే. ఇకపోతే ఈ శ‌నివారం ఆ దాడికి 78 ఏళ్లు నిండనున్నాయి. 

అమెరికాలో కాల్పులు: తప్పించుకొన్న ఐఎఎఫ్ చీఫ్