అమెరికాలో అరియానా ఫ్యూన్స్ అనే బాలిక దారుణ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు.  వివరాల్లోకి వెళితే. . గత నెల 11న తాను ఆశ్రయం పొందే యూత్ గ్రూప్ హోం నుంచి ఆమె పారిపోయింది.. అనంతరం అదే నెల 17న ఇంటికి వెళ్లేందుకు తన తల్లికి పరిచయస్తుడైన ఓ వ్యక్తిని కలిసి బెన్నింగ్ మెట్రో స్టేషన్ వద్ద తనను దించాలని కోరింది.

అయితే మార్గమధ్యలో వీరి కారును అడ్డగించిన పదిహేను మందితో కూడిన ఓ గుంపు అరియానా వెంట వున్న వ్యక్తిని బయటికి ఈడ్చిపారేసింది. అనంతరం అతనిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాది.. అర్ధనగ్నంగా ఆ వ్యక్తిని కూర్చొబెట్టారు.

కాసేపు పైశాచిక ఆనందం పొందిన తర్వాత అతని వద్ద నుంచి 500 డాలర్లు, ఏటీఎమ్ కార్డులు లాక్కున్నారు. చివరికి ఎలాగోలా అక్కడికి చేరుకున్న అరియానా అతనిని హింసించవద్దంటూ దుండగులను బతిమలాడటంతో సదరు వ్యక్తిని వదిలిపెట్టారు.

అయితే అరియానా చేతి అతనిని కిడ్నాప్ చేయించాలని భావించిన గ్యాంగ్‌కు ఈ విషయం తెలియడంతో అరియానాపై అనుమానం వచ్చింది. ఈ విషయం పోలీసులకు చెబుతుందని భయపడ్డ ముఠా సభ్యులు ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.

కుట్రలో భాగంగా ఏప్రిల్ 18న అరియానాను మేరీలాండ్ రాష్ట్రంలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరిలో ఎస్కోబార్ ఆమెను వివస్త్రను చేసి చెక్క బ్యాట్, బేస్‌బాల్‌తో తలపై బలంగా కొట్టాడు.

ఆ తర్వాత ఫ్యూంటెన్స్ ఒక కత్తిగా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తతంగాన్నంతా మరో వ్యక్తి వీడియో తీస్తూ రాక్షాసానందం పొందాడు. హెర్నాండెజ్ అనే బాలిక నిందితులకు సహకరించినట్లుగా తెలుస్తోంది.

అరియానాను హత్య చేసే సమయంలో హెర్నాండెజ్‌ను టన్నెల్ బయట నిల్చొబెట్టారు. విచారణలో భాగంగా ఆమె తొలుత ఆ సమయంలో ఆడ మనిషి అరుపులు విన్నానని.. కాసేపటి తర్వాత ఎస్కోబార్‌, ఫ్యూంటెన్స్ బయటికి వచ్చారని తెలిపింది.

ఆ సమయంలో వారి ముఖం, బట్టలు పూర్తిగా రక్తంతో తడిచిపోవడంతో తనకు భయం వేసిందని పేర్కొంది. అయితే ఉద్దేశ్యపూర్వంగానే హెర్నాండెజ్ టన్నెల్ బయట నిల్చొని హంతకులకు సహకరించిందని పోలీసులు వెల్లడించారు.

హత్యకు ఉపయోగించిన కత్తి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సమీపంలో దొరికింది. సదరు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు విచారణకు బాగా సహకరించింది. కాగా అరియానా హత్యలో భాగం పంచుకున్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.