Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అయితే, ఇప్ప‌టికే రష్యా ఉక్రెయిన్ లోని  పెద్ద సంఖ్యలో సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సైనిక‌ బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. ఈ క్ర‌మంలోనే స్నేక్ ఐలాండ్ లో ర‌ష్యా సైనికుల‌కు లొంగిపోవ‌డానికి నిరాక‌రించిన 13 మంది ఉక్రెయిన్  సైనికులు మ‌ర‌ణించారు.  

Russia Ukraine Crisis: ర‌ష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాల‌ని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. అయితే, ఇప్ప‌టికే రష్యా ఉక్రెయిన్ లోని పెద్ద సంఖ్యలో సైనిక స్థావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సైనిక‌ బ‌ల‌గాలు కీవ్ న‌గ‌రంలోకి ప్ర‌వేశించాయి. ఈ క్ర‌మంలోనే స్నేక్ ఐలాండ్ లో ర‌ష్యా సైనికుల‌కు లొంగిపోవ‌డానికి నిరాక‌రించిన 13 మంది ఉక్రెయిన్ సైనికులు మ‌ర‌ణించారు. దీనికి బంధించిన రిపోర్టులు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఉక్రెయిన్‌లోని స్నేక్ ఐలాండ్‌లో ఉన్న మొత్తం 13 మంది సైనికులు గురువారం రష్యా సైనిక దాడిలో మరణించారు. అయితే, రష్యా సైనిక దాడిలో మరణించిన 13 మంది ఉక్రేనియన్ సైనికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయే ముందు ఈ ఘ‌ట‌న‌ను ముందు క్షణాలను షేర్ చేశారు.

రష్యా గురువారం దేశంపై దాడి చేయడంతో ఉక్రెయిన్‌లోని స్నేక్ ఐలాండ్‌లో ఉన్న సైనికుల చిన్న దళం అందరూ మరణించారు. రష్యన్ నేవీ యుద్ధనౌక నుండి రేడియో కమ్యూనికేషన్ ద్వారా ద్వీపంలో ఉన్న సైనికులు త‌మ ముందు లొంగిపోవాలని హెచ్చరించింది. దీనిని ధిక్కరించిన ఉక్రేనియన్లు రష్యన్‌లకు "మీరే వెళ్లండి" అని చెప్పడంతో ర‌ష్యా బాంబు దాడి చేసి... వారి ప్రాణాలు తీసింది. "రక్తపాతం మరియు అనవసరమైన ప్రాణనష్టం జరగకుండా ఉండటానికి మీరు మీ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని మేము సూచిస్తున్నాము. లేకపోతే, మీరు బాంబు దాడికి గురవుతారు" అని ర‌ష్యాన్ సైనికులు పేర్కొన్నారు. దీనికి ఉక్రేనియన్ సైనికులు వారి సమాధానాన్ని నిర్ణయించే ముందు రష్యన్ అల్టిమేటంకు ఎలా స్పందించాలో క్లుప్తంగా చర్చించడం అందులో వినవచ్చు . అప్పుడు సైనికులలో ఒకరు ప్రతిస్పందిస్తూ.. "రష్యన్ యుద్ధనౌక, మీరే వెళ్ళండి" అంటూ స‌మాధాన‌మిచ్చారు. 

నల్ల సముద్రంలోని రోమేనియన్ భూభాగానికి సమీపంలో ఉన్నందున వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన జిమిని ద్వీపం అని కూడా పిలువబడే చిన్న ద్వీపం వెలుపల ఉన్న ఒక సైనికుడు, త్వరలో జరగబోయే ఘోరమైన ఈ వాగ్వివాదం ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన లైవ్ స్ట్రీమ్ షార్ట్ క్లిప్ , రష్యన్ యుద్ధనౌక కాల్పులు జరుపుతున్నప్పుడు సైనికుడు డకింగ్ చేస్తున్నాడని చూపిస్తుంది. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ స్నేక్ ఐలాండ్ లోని ఉక్రెయిన్ సైనికుల మ‌ర‌ణాల‌ను ధృవీక‌రించారు. సైనికులు లొంగిపోనందుకు వారిని ప్రశంసించారు. మరణానంతరం వారికి "హీరో ఆఫ్ ఉక్రెయిన్" బిరుదును ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలావుండ‌గా, రష్యా దాడి మొదటి రోజులో మరణించిన 137 మంది ఉక్రేనియన్లలో 13 మంది సైనికులు మాత్రమే ఉన్నారని జెలెన్స్కీ చెప్పారు.

"ఈ రోజు రష్యా మా దేశ మొత్తం భూభాగంపై దాడి చేసింది. వారి దాడిని ఎదుర్కొనేందుకు మ‌న సైనికులు పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ రోజు మన 137 మంది హీరోలను కోల్పోయాము. అలాగే, మ‌రో 316 మంది గాయపడ్డారు" అని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు పేర్కొన్నాడు. అయితే, ర‌ష్యా.. ఉక్రెయిన్ పై కొన‌సాగిస్తున్న ఈ మిలిట‌రీ చ‌ర్య‌లో భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ దాడిలో దాదాపు 800 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది . 

Scroll to load tweet…