లాస్ ఏంజెలెస్: అమెరికా మరోసారి కాల్పులతో మారుమ్రోగిపోయింది. ఓ సాయుధుడు కాలిఫోర్నియాలోని ఓ బారులో బుధవారం రాత్రి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో 13 మంది మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించాడు. 

కాలిఫోర్నియాలోని ఓ బార్ అండ్ డ్యాన్స్ హాల్ లో సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. థౌడండ్ ఓక్స్ పట్టణంలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ లో సాయుధుడు కాల్పులు జరిపాడు. 

సాయుధుడు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. రాత్రి 11.30 గంటలకు కాల్పుల సంఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. బార్ లోకి చొరబడి ఆగంతకుడు బ్లాక్ పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.