Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ తో పదేళ్ల బాలిక మృతి.. తీవ్ర ఆంక్షలు విధించిన ఇటలీ !

చైనా యాప్ టిక్ టాక్ పై ఇటలీలో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇటలీ ప్రభుత్వం యాప్ పై అనేక ఆంక్షలు విధించింది. ఓ బాలిక మృతే దీనికి కారణం. టిక్‌టాక్‌లో ఓ వీడియో చేస్తున్న ప్రయత్నంలో ఆ బాలిక మృతి చెందడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ ఘటనతో ఆ యాప్‌పై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

10-year-old Italian girl dies while playing 'blackout challenge' on TikTok - bsb
Author
Hyderabad, First Published Jan 23, 2021, 1:26 PM IST

చైనా యాప్ టిక్ టాక్ పై ఇటలీలో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇటలీ ప్రభుత్వం యాప్ పై అనేక ఆంక్షలు విధించింది. ఓ బాలిక మృతే దీనికి కారణం. టిక్‌టాక్‌లో ఓ వీడియో చేస్తున్న ప్రయత్నంలో ఆ బాలిక మృతి చెందడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ ఘటనతో ఆ యాప్‌పై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

సిసిలీలోని ఓ పదేళ్ల బాలిక టిక్‌టాక్‌ వినియోగిస్తోంది. యాప్‌లో వచ్చిన ‘బ్లాకౌట్‌ చాలెంజ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండీ అవుతున్న సాహస కృత్యాన్ని వీడియోను చేయడానికి బాలిక ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రయత్నం చేస్తూ ఫోన్‌లో రికార్డింగ్‌ చేయడానికి ట్రై చేసింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మెడకు బెల్ట్‌ బిగుసుకుపోయి ఆ బాలిక బాలిక్‌ బాత్రూమ్‌లో పడిపోయింది.

ఆ బాలికను చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఆక్సిజన్‌ అందక గుండె కండరాలు స్తంభించడంతో బ్రెయిన్‌ డెడ్‌కు గురై ఆ బాలిక కన్నుమూసింది. అయితే ఆ తల్లిదండ్రులు ఆ చిన్నారి అవయవాలను దానం చేయడం విశేషం.

ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టిక్‌టాక్‌ వినియోగంపై తీవ్ర ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 13ఏళ్లలోపు బాలబాలికలు ఉపయోగించరాదని నిబంధనలు విధించింది. మైనర్ల రక్షణకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. టిక్‌టాక్‌ వినియోగించాలంటే తప్పనిసరిగా 13 ఏళ్లు దాటి ఉండాలని స్పష్టం చేసింది. 

దీనిపై గత డిసెంబర్‌లోనే నిబంధనలు రూపొందించగా అవి అమలుకాకపోవడంతో ఇటలీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా స్పందించకుంటే టిక్‌టాక్‌ యాప్‌ నిషేధానికి కూడా సిద్ధమైంది. భారత్‌లో గతేడాది జూన్‌ 29వ తేదీన టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
 
Follow Us:
Download App:
  • android
  • ios