ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత సుమారు 10 మిలియన్ల జనాభా దేశం నుండి వలస వెళ్లిందని ఐక్యరాజ్యసమతి  అంచనా వేసింది. ఈ మిలటరీ ఆపరేషన్ తో పలు నగరాలపై రష్యా బాంబులు, మిస్సైల్స్ తో దాడులకు దిగిన విషయం తెలిసిందే.

కీవ్: Ukraine పై Russiaమిలటరీ ఆపరేషన్ నేపథ్యంలో సుమారు 10 మిలియన్ జనాభా ఉక్రెయిన్ నుండి వలస వెళ్లి ఉంటారని UNO అంచనా వేసింది. కొన్ని కుటుంబాలు సెంట్రల్ బుడా‌ఫెస్ట్‌లోని న్యుగటి రైల్వే స్టేషన్ గుండా సరిహద్దులకు చేరుకొంటున్నారు. ఇక్కడ స్వచ్ఛంధ సేవా సంస్థలు ఆహారం, వస్తువులను వలసదారులకు సరఫరా చేస్తున్నారు. మరో వైపు మరికొందరు శరణార్ధులు జకర్‌పట్టియా ఒబ్లాస్ట్ నుండి తూర్పు ఉక్రెయిన్‌లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరమైన ఒడెస్సా నుండి కూడా కూడ కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని యూఎన్ఐ ప్రకటించింది.

గత నెల 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. అయితే ఈ నెల 5వ తేదీ నుండి ఉక్రెయిన్ పై రష్యా కాల్పుల విరమణను ప్రకటించింది. ఈ రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలను విధించాయి. దీంతో రష్యా భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.

USA సెనేటర్లతో సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు zelensky కీలక విన్నపం చేశారు. రష్యన్ చమురుపై నిషేధం విధించాలని కోరారు. రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ లో కీలకమైన ఒడెశాకు సమీపంలో రష్యా బలగాలు మోహరించాయి.రష్యన్ దళాలు తమ ప్రాంతంలోకి రాకుండా ఉక్రెయిన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. మరో వైపు ఉత్తరాన ఉన్న Kviv నగరానికి సమీపంలో రష్యన్ ఆర్మీ సేనలు మోహరించాయి.

రష్యా అధ్యక్షుడు Putin తో ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ మాస్కోలో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. రష్యన్ దళాలు మారియుపోల్ నగరాన్ని చుట్టుముట్టాయి. వైద్య సామాగ్రితో పాటు ఇతర సహాయాన్ని అందించడం కొంత ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజూ Bomb దాడులు సాగుతున్నా కూడా స్థానిక ప్రభుత్వం రష్యాకు లొంగిపోవడానికి మాత్రం నిరాకరించింది.

జావెలిన్, స్టింగర్ క్షిపణులు ఇతర ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేసేందుకు NATO దేశాలు ప్రయత్నిస్తున్నారు. అమెరికా కూడా తమ దేశం నుండి కీలకమైన ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేస్తుంది.

ఉక్రెయిన్ లోని రెండు అణు విద్యుత్ ప్లాంట్లను రష్యా ఆక్రమించుకొంది.. మూడో అణు విద్యుత్ ప్లాంట్ ను యుజ్నౌ‌క్రైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై రష్యా కన్ను పడింది. ఈ ప్లాంట్ ను కూడా రష్యా ఆక్రమించుకొనే ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని ఉక్రెయిన్ అనుమానిస్తుంది.

 మైకోలైవ్ కు ఉత్తరాన 120 కి.మీ దూరంలో ఈ అణు విద్యుత్ ప్లాంట్ ఉంది.బెలారస్ సరిహద్దులో జరిగిన రష్యా ఉక్రెయిన్ మధ్య మొదటి రెండు రౌండ్ల చర్చల వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం దక్కలేదు. మూడో దఫా చర్చలు సోమవారం నాడు జరగనున్నాయి. యుద్ద ప్ర‌భావం ర‌ష్యాకు అర్థ‌మ‌యింద‌ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది. తమప్రతిఘటన, అంతర్జాతీయ ఆంక్షల పట్ల ర‌ష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణను ప్రకటించిందనే అభిప్రాయాన్ని ఉక్రెయిన్ అభిప్రాయపడింది.