అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు.. ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు కారణంగా  31మంది మృతిచెందగా.. సుమారు 200మంది అదృశ్యమయ్యారు, 2లక్షల 50వేల మంది తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ కార్చిచ్చు కారణంగా వేలాది ఏకరాల అడవి బూడిదపాలు కాగా.. ప్యారడైజ్ పట్టణమంతా నల్లటి పొగతో కుమ్ముకున్నది. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ మంటలకు తోడు బలమైన గాలులు కూడా తోడు కావడంతో మంటలు మరింత ఎక్కువ అవుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

మంటలను పూర్తిగా ఆపడానికి కనీసం మరో మూడు వారాలైనా పడుతుందని అక్కడి అధికారులు అంచనావేస్తున్నారు.