'నా కొడుకు తండ్రే పాక్ కాబోయే ప్రధాని'

"My Sons' Father Is Next PM": Jemima Goldsmith Congratulates Imran Khan
Highlights

పాక్‌లో జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ  120 స్థానాల్లో విజయం సాధించింది.  మ్యాజిక్ ఫిగర్‌వైపు దూసుకు వెళ్లోంది.ఈ సమయంలో ఇమ్రాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్లామాబాద్:పాక్‌లో జరిగిన ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ  120 స్థానాల్లో విజయం సాధించింది.  మ్యాజిక్ ఫిగర్‌వైపు దూసుకు వెళ్లోంది.ఈ సమయంలో ఇమ్రాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్ స్మిత్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

22 ఏళ్ల అవమానాలకు  ఫలితం ఇది అని అంటూ ఆమె ట్వీట్ చేశారు. 22 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, త్యాగాలు, అడ్డంకులు వీటన్నింటికి ఫలితం ఇవాళ లభించిందన్నారు. తన కొడుకు తండ్రే పాకిస్తాన్ ‌కు కాబోయే ప్రధాని అవుతారని ఆమె చెప్పారు. 

 ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, దాన్ని సాధించడమే ఇప్పుడు మీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు. శుభాకాంక్షలు ఇమ్రాన్‌ ఖాన్‌’ అంటూ అభింనందనలు తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ తన 42 వ ఏట తన వయసులో సగం ఉన్న(21 ఏళ్లు) జెమిమా గోల్డ్‌ స్మిత్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందే జెమిమా ఇస్లాం మతంలోకి మారారు. వివాహమైన కొద్ది కాలానికే ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహమైన తొమ్మిదేళ్ల, 2004లో తర్వాత జెమిమా - ఇమ్రాన్‌లు విడిపోయారు.


 

loader