హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన హత్య జరిగింది. ఓ యువకుడు హైదరాబాదులోని జగద్గిరిగుట్ట ఆర్పీ కాలనీలో హత్య గురయ్యాడు. ప్రత్యర్థులు అత్ని వెంటాడి చంపారు. కత్తులు పట్టుకుని తరుముతూ అతన్ని చంపారు. 

మృతుడిని ఫయాజ్ అనే రౌడీ షీటర్ గా గుర్తించారు. కాలనీవాసులే అతన్ని హత్య చేశారని ఫయాజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంత్, చంపక్, టిల్లు అనే యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.