హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువకుడు అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు. దాంతో అతను కటకటాల పాలయ్యాడు. 9 నెలల లేగదూడపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని నారాయణగుడా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాదులోని హైదర్ గుడాలో గల అవంతినగర్ లో నివాసం ఉండే శివకుమార్ కు స్థానికంగా పశువుల కొట్టం ఉంది. అందులో మహేష్ అనే 30 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు. అతను బాల్యం నుంచి పశువుల కాపరిగా పనిచేస్తూ వస్తున్నాడు. 

బుధవారం రాత్రి మహేష్ లేగదూడపై లైంగిక దాడి పాల్పడ్డాడు. దాన్ని ఆ కొట్టం పక్కనే ఉన్న ఇంటి యజమాని కిశోర్ వర్మ చూశాడు. వెంటనే అతను నారాయణగుడా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

నారాయణగుడా ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, ఎస్సై నారాయణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత మహేష్ ను అరెస్టు చేసారు.