రోజు రోజుకిమహిళల పై జరుగుతున్న ఆకృత్యలకు హద్దు ఆపు లేకుండా పోతుంది.ఎన్నో రంగుల హరి విల్లులతో భర్తతో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన నవ వధువు నాలుగు నెలలకే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖ జిల్లా పెదంగంట్యాడలో చోటు చేసుకుంది.

Also Read అంతులేని విషాదం: డాడీ కారు కింద పడి కూతురు మృతి...

నాలుగు నెలల క్రిందట గాజువాకకు చెందిన గౌతమ్ అనే వ్యక్తికి యలమంచిలికి చెందిన ప్రియ ప్రేమ వివాహం జరిగింది. అయితే గౌతమ్  ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా, ప్రియ బ్యుటీషియన్ గా చేస్తుంది , రాత్రీ భర్త భార్యకు మద్య చిన్నపాటి వాగ్వదం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు,  ఈ నేపథ్యంలో ప్రియ క్షణికా ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే.. పెళ్లైన నాటి నుంచి గౌతమ్ భారయ ప్రియను వేధిస్తున్నాడని.. అవి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు గౌతమ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.