హైదరాబాద్: తెలంగాణలోని మేడ్చల్ వద్ద హైదరాబాదు రింగ్ రోడ్డుపై నుంచి లారీ కింద పడింది. దీంతో ఇద్దరు మరణించారు. కీసర నుంచి మేడ్చల్ వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఓఆర్ఆర్ మీది నుంచి కింద పడింది. వేగంగా దూసుకొచ్చి వంతెనపై నుంచి లారీ కింద పడింది.

అతి వేగం వల్ల అదుపు తప్పి లారీ కింద పడినట్లు భావిస్తున్నారు. ప్రవీణ్, భాస్కర్ అనే ఇద్దరు వాహనంలోనే ఇరుక్కుపోయి మరణించారు. మద్యం సేవించి లారీ నడిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాలు అందాల్సి ఉంది.