హైదరాబాదులోని కుల్సుంపురాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బాలికతో మాత్రలు మింగించి ఓ యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని కుల్సుంపురాలో చోటు చేసుకుంది. 

బోనాల ఉత్సవాల సమయంలో రోహన్ అనే యువకుడికి బాధితురాలు పరిచయమైంది. ఆ పరిచయంతో సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఈ క్రమంలో రోహన్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

బాలికతో బలవంతంగా మాత్రులు మింగించినట్లు తెలుస్తోంది. విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించారు. చివరకు బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహన్ పరారీలో ఉన్నాడు.