హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) పీజీ హాస్టల్లో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పీజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 3లో నరసయ్య అనే విద్యార్థి శవమై కనిపించాడు. నరసయ్య జాగ్రఫీ డిపార్టుమెంట్ లో పిహెచ్ డీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

నరసయ్య మృతికి కారణాలు తెలియడం లేదు. ఓయూ సైన్క్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, జితేందర్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.విద్యార్థులు హాస్టల్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.