హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ వృద్ధుడు దారుణమైన సంఘటకు పాల్పడ్డాడు. ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ 70 ఏళ్ల వృద్ధుడికి ఇప్పటికే నలుగురు భార్యలు ఉన్నారు. 

ఆర్థిక సాయం చేస్తానంటూ ఆ వృద్ధుడు యువతిపై అత్యాచార యత్నానికి దిగాడు. ఈ సంఘటన హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో యువతి హైదరాబాదు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. 

యువతి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతన్ని 70 ఏళ్ల సలీముద్దీన్ గా పోలీసులు గుర్తించారు.