హైదరాబాదులో మిల్క్ బూత్ వ్యక్తికి కరోనా: భయాందోళనలో పాలు కొన్నవాళ్లు

ఓ మిల్క్ బూత్ యజమానికి హైదరాబాదులో కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని సోదరికి, అతను నివాసం ఉంటున్న వాచ్ మన్ కుమారుడికి కూడా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

Milk booth vendor infected woth coronavirus in Hyderabad

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని ముషీరాబాద్ ప్రాంతంలో ఓ మిల్క్ బాత్ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పరీక్షల్లో అతని సోదరికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. అంతేకాకుండా వాళ్లు నివాసం ఉంటున్న ఆపార్టుమెంట్ వాచ్ మన్ ఐదేళెల కుమారుడికి కూడా పాజిటివ్ వచ్చింది.

దాంతో మిల్క్ బూత్ వ్యక్తికి చెందిన 16 మందిని క్వారంటైన్ కు తరలిం్చారు. దానికితోడు, ఆపార్టుమెంటులో నివాసం ఉంటున్న 40 మందిని క్వారంటైన్ కు తరలించారు. అతని వద్ద పాలు కొనుగోలు చేసిన వ్యక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. 

కాగా, హైదరాబాదులోని నేరేడుమెట్ మధురానగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతని కుటుంబం మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం అన్నదానం చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. దాంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 మంది ఇందులో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. 

ఇదిలావుంటే, భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 14,378కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 448కి చేరుకుంది. 

ఒడిశాకు కొంత ఊరట లభించింది. గత మూడు రోజులుగా ఒడిశాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెంపులో తగ్గుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తి తగ్గిందని చెప్పింది.

రికవరీ రేటు శనివారం అత్యధికంగా నమోదైంది. మహారాష్ట్ర కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతూనే ఉన్నది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 286 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంంబైలోనే 177 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 194కు చేరుకుంది.

ఇండియన్ నేవీలో 20 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.తెలంగాణలో 766 కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios