హైదరాబాద్: ఓ ఎన్నారై ఫిర్యాదుతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులు మాళవిక అనే మహిళను అరెస్టు చేశారు. తన వద్ద 65 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని వరుణ్ అనే ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ అని చెప్పి తనను మోసం చేసిందని ఆయన ఫిర్యాదు చేశారు.  

హైదరాబాదులోని ఓ భూమి వివాదంలో తనకు డబ్బులు అవసరమని చెప్పి తన వద్ద 65 లక్షల రూపాయలు తీసుకుందని ఆయన చెప్పారు. అయితే, మాట్రిమోనీ సైట్లలో అందమైన ఫొటోలు పెట్టి మాళవిక యువకులకు వల వేయడంలో దిట్ట అని అంటున్నారు. 

గతంలో కూడా ఆమె మూడు సార్లు అరెస్టయినట్లు తెలుస్తోంది. ఆమె మోసానికి భర్తతో పాటు అత్తామామలుకూడా సహకరిస్తున్నారని అంటున్నారు. ఎన్నారై ఫిర్యాదు ఆమె మోసాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.