మద్యం అమ్మకాలు మొదలైన గంటకే హైదరాబాద్ లో దారుణం..
ఈ రోజు తెలంగాణవ్యాప్తంగా వైన్ షాపులు తేరిచారు. హైదరాబాదులో పెద్ద యెత్తున మందుబాబులు క్యూ కట్టారు. మందుబాబులు అప్పుడే ఇంట్లో వివాదాలకు దిగడం ప్రారంభమైంది.
హైదరాబాద్: కుటుంబాల్లో చిచ్చు పెట్టే మద్యం గురించి చెప్పనే అవసరం లేదు. కాపురాలను ఛిన్నాభిన్నం చేయడంలో ముందుంటుంది. కరోనా వైరస్ కారణంగా గత 40 రోజులుగా మూసి ఉన్న మద్యం దుకాణాలను తెలంగాణ లో ఇవాళ తెరిచారు. దీంతో మద్యం కొనుగోలు దారులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున క్యూ కట్టారు.
చాంతాండంత లైన్ల లో నిల్చుని కొన్న మందును విజయోత్సాహంతో ఇంటికి తీసుకు వెళుతున్నారు. అయితే కొంత మంది ఫుల్లుగా తాగి ఇంట్లో వారితో గొడవకు దిగుతున్నారు. నగరం లోని బాలా నగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పూటు గా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు.
లాక్ డౌన్ సమయంలో ఎందుకు కొన్నావని భార్య అడిగితే.. తాగిన మైకం లో ఉన్న ప్రసాద్ ఏకంగా బ్లేడు తో శరీరం పై కోసు కోవడం మొదలు పెట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకుని భార్యాభర్తల గొడవను సర్దుబాటు చేశారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి. ఈ లోపలే మద్యం ప్రియులు కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి కర్ప్యూ కొనసాగుతుంది.
మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. భౌతిక దూరం పాటించకపోతే దుకాణాలు మూసేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, మైలార్ దేవ్ పల్లి, తదితర ప్రాంతాల్లో రద్దీని నియంత్రించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.