హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా ఫిజియోథెరపిస్టు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనకు నచ్చినవాడితో పెళ్లి చేసేందుకు నిరాకరించి మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు వెతకడం ప్రారంభించారు.

దాంతో ఆమె తాను నివాసం ఉంటున్న గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ సంఘటన హైదరాబాదులోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ కు చెందిన వరప్రసాద్ కూతురు తన్మయి (31) మియాపూర్ లోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది.

ఆ క్రమంలో ఆమె తన తమ్ముడితో కలిసి ఆర్బీఆర్ కాంప్లెక్స్ లోని గదిలో ఉంటోంది. అయితే, తల్లిదండ్రులు తనకు నచ్చిన వ్యక్తిని కాదని వేరే సంబంధాలు చూస్తున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.