Asianet News TeluguAsianet News Telugu

మహిళా డాక్టర్ కు నైజీరియన్ గ్యాంగ్ వల... పెళ్లి పేరుతో నమ్మించి...

హైదరాబాద్ లో నివాసముండే ఓ ఒంటరి మహిళా డాక్టర్ ను పెళ్లిపేరుతో మోసం చేసింది ఓ నైజీరియన్ గ్యాంగ్. 

 

 

Lady doctor cheated by Nigerian gang via matrimony website
Author
Hyderabad, First Published Mar 11, 2020, 10:05 PM IST

హైదరాబాద్: నగరంలో పోలీసుల కళ్లుగప్పి మ్యాట్రిమోనీ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సైబరాబాద్ లో ఓ మహిళా డాక్టర్ మ్యాట్రిమోనీ ద్వారా మోసపోయింది. ఇటీవలే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె మళ్లీ వివాహం చేసుకునేందుకు భారత్ మ్యాట్రిమోనీలోని డైవర్సీ మాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా తానుకూడా డాక్టర్ నే అంటూ ఓ యువకుడు మోసం చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని సైబరాబాద్  పోలీసులు భగ్నం చేసి మహిళా డాక్టర్ మోసపోకుండా అడ్డుకున్నారు.  

హైదరాబాద్ మహిళా డాక్టర్ మ్యాట్రిమోనీలో పెట్టిన వివరాలను సేకరించిన విపుల్ ప్రకాష్ అనే వ్యక్తి తాను కూడా డాక్టర్ నే అంటూ ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తాను యూకే(లండన్)లో డాక్టర్‌ను అంటూ ఆమెను నమ్మించాడు. అతడిమాటలు నిజమనేనని నమ్మిన ఆమె అతనితో చాట్ చేయడం ప్రారంభించింది. వాట్సప్, ఫేస్‌బుక్, మెయిల్స్ లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. 

ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించగా తాను త్వరలోనే ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటా అని ఆమెను నమ్మించాడు. అంతకుముందు తాను చాలా విలువైన బహుమతులు పంపుతున్నానని... వాటిని పొందాలంటే 7 లక్షలు ట్యాక్స్ కట్టాలని తెలిపాడు. అప్పటికే అతడి మాయలో పూర్తిగా పడిపోయిన డాక్టర్ అందుకు సిద్దపడి అతడు పంపిన అకౌంట్ లో డబ్బులు వేశారు. 

అయితే ఆమెకు బహుమతి రూపంలో ఓ లాకర్ వచ్చింది. అందులో వజ్రాల నెక్లెస్ ఉంటుందని నమ్మి మొత్తం డబ్బులు సమర్పించుకున్నాక తీరా చూస్తే అందులో ఏమీ లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె అందించిన వివరాల సాయంతో సదరు నఖిలీ డాక్టర్ పై నిఘా పెట్టింది..

అయితే ఈ మాట్రిమోనీ మోసం చేసేది ఒక వ్యక్తి కాదు మొత్తం అయిదు మందితో కూడిన గ్యాంగ్ అని గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు నైజేరియన్లతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని... ప్రధాన నిందితుడు ఎసెలు ఉడో పరారీ ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు.  వీరిపై గతంలో బెంగళూరులో కేసులు ఉన్నట్లు కూడా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios