హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ కుటుంబంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్ లోని గణేష్ నగర్ లో నివాసం ఉంటున్న జి.శ్రీనివాస్ రెడ్డి కుమారుడు జి.రంజిత్ కుమార్ రెడ్డి బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. .

మృతదేహాన్ని బెంగుళూర్ నుంచి ఉప్పల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఐటి టాపర్ గా ఎన్నికై బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తున్న రంజిత్ కుమార్ ఆత్మ హత్య కు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

రంజిత్ కుమార్ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.