హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని మియాపూర్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. నల్లగా ఉందనే కారణంతో యోగి అనే వ్యక్తి తన భార్యను చంపి, తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యోగికి ఆరు నెలల క్రితమే మేనకోడలు అరుణతో వివాహమైంది. 20 రోజుల క్రితం భార్యను కాపురానికి తీసుకుని వచ్చాడు. అయితే ఆమె నల్లగా ఉందనే కారణంతో దారుణానికి పాల్పడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయలేదని అతను మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

వివరాలు అందాల్సి ఉంది.