Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో భారీ వర్షం: విద్యుత్తు షాక్ తో డాక్టర్ మృత్యువాత

భారీ వర్షాలతో సెల్లార్ లోకి చేరిన వర్షం నీరు ఓ డాక్టర్ ను బలి తీసుకుంది. క్లినిక్ లోకి చేరిన నీరు తోడేసేందుకు మోటార్ వేయడానికి వెళ్లి డాక్టర్ విద్యుత్తు షాక్ తో అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

Heavy rains in Hyderabad: Doctor Satish Reddy dies
Author
Banjara Hills, First Published Oct 14, 2020, 6:05 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యోగా క్లినిక్ లో వర్షపు నీరు చేరింది. నీటి కోసం మోటర్ వేయడానికి వెళ్లిన డాక్టర్ సతీష్ రెడ్డి విద్యుత్ షాక్ మరణించారు. అపార్ట్మెంట్లోని సెల్లార్ లో పెద్ద ఎత్తున వర్షపునీరు చేరడంతో నీటిని తోడేందుకు మోటర్ వేయడానికి వెళ్లాడు. కరెంట్ షాక్ తగిలి అనంతలోకాలకు వెళ్లిపోయారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు చిగురాటుకాల వణుకుతోంది. భారీ వర్షాలు హైదరాబాదులో బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు వర్షానికి సంబంధించిన కారణాలతో 15 మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. గగన్ పహాడ్ వద్ద మూడు మృతదేహాలు వరదలో కొట్టుకుని వచ్చాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

చాదర్ ఘాట్ వద్ద మూసీ నది ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పెరిగింది. హైదరాబాదులో దాదాపు 1500 కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్టుమెంటుల్లోని సెల్లార్లు నీటితో నిండిపోయాయి. ముందు జాగ్రత చర్యగా అపార్టుమెంట్లలోని లిఫ్టులను నిలిపేశారు. హైదరాబాదులో పలు ప్రాంతాలు మంగళవారం రాత్రి నుంచి కరెంట్ లేక చీకట్లో మగ్గుతున్నాయి. 

హైదరాబాదులో రోడ్లు నదుల్లా, కాలనీలు చెరువుల్లా మారాయి. ఘట్కేసర్ లో అత్యధికంగా 32.3 శాతం వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. 

వరంగల్, హైదరాబాదు జాతీయ రహదారిపై వరద నీరు పెద్ద యెత్తున ప్రవహిస్తోంది. మైలార్ దేవ్ పల్లిలో రెండు బస్సులు వరదలో చిక్కుకున్నాయి.  ప్రయాణికులు బస్సుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. 

హైదరాబాదుకు వచ్చే పలు రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. మరో రెండు రోజుల పాటు హైదరాబాదులో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో రెండు రోజులు ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. 

సంప్రదించాల్సిన నెంబర్లు

అత్యవసర సేవ కోసం.. 040-211111111, జిహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866, జిహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్తు శాఖ - 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500,

Follow Us:
Download App:
  • android
  • ios