హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్ప ఓ యువకుడు యువతిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బలవంతంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

ఈ సంఘటన హైదరాబాదులో మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ స్పెక్టర్ శంకర్ యాదవ్ అందించారు. న్యూబోయిగుడాకు చెందిన ఓ యువతి కుటుంబం మూడేళ్ల క్రితం యాప్రాల్ ప్రాంతంలో నివాసం ఉంటూ వచ్చింది. 

ఆ సమయంలో ఇంటి పక్కన ఉండే రవి అనే వ్యక్తి నల్లగొండ జిల్లాకు చెందిన డ్రైవర్ మహేష్ (27)ను పరిచయం చేశాడు. యువతి ఫోన్ నెంబర్ సంపాదించిన మహేష్ గత ఏడాది నుంచి ఆమెతో స్నేహం చేస్తూ వస్తున్నాడు. తరుచుగా ఫోన్ లో మూట్లాడుతూ ఉండేవాడు. 

కొద్ది నెలల నుంచి తాను ప్రేమిస్తున్నట్లు యువతిని వేధిస్తూ వచ్చాడు. జులైలో మహేష్ ఆ యువతి పనిచేస్తున్న దుకాణం వద్కు వచ్చి జూపార్కుకు వెళ్దామంటూ తన టూవీలరు మీద తీసుకుని వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఈ నెల 12వ తేదీన జరిగింది. 

మర్నాడు ఉదయం 7 గంటల సమయంలో ఆ యువతిని న్యూబోయిగుడాలోని పెట్రోల్ బంకు వద్ద వదలిపెట్టి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత విషాయన్ని యువతి తల్లితో చెప్పింది. దాంతో గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.