Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ భర్త్ డే సందర్భంగా భారీ కటౌట్లు... ఏకంగా మంత్రిపైనే జరిమానా

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. 

GHMC Fines Minister Talasani Over KCR Birthday Hordings
Author
Hyderabad, First Published Feb 15, 2020, 8:03 PM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జీహెచ్ఎంసీ షాకిచ్చింది. అధికారిక అనుమతి లేకుండా నగరంలో ఏర్పాటుచేసిన హోర్డింగ్, ప్లెక్సీలపై జీహెచ్ఎంసీ యాక్షన్ తీసుకుంది. ఏకంగా మంత్రి తలసానికే రూ.5 వేల జరిమానా విధిస్తూ నోటీసులు పంపించింది. 

ఈ నెల 17వ తేదీన  ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు  నేపథ్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ భారీ హోర్డింగ్ లు వెలిశాయి. అయితే అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన వాటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు గుర్తించి వాటిని ఏర్పాటుచేసిన వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలోనే తలసానికి కూడా ఫైన్ విధించారు. 

read more   మజ్లీస్ తో కలిసి టీఆర్ఎస్ కుట్ర: పాతబస్తీ మెట్రోపై కిషన్ రెడ్డి

అయితే ముఖ్యమంత్రిపై అభిమానంతో ''లవ్ యూ కేసీఆర్'' అంటూ మంత్రి ఏర్పాటుచేసిన ప్లెక్సీలపై అధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అన్న చర్చ కూడా నగరవాసుల్లో మొదలయ్యింది. 

ముఖ్య నాయకుల పుట్టినరోజులు, పార్టీ కార్యక్రమాలు, ఇతర వేడుకల సమయంలో హోర్టింగ్ లు, ప్లెక్సీలు పెట్టడం కంటే మొక్కలను నాటడం చేయాలని గతంలో స్వయంగా పురపాలక మంత్రి కేటీఆరే పార్టీ శ్రేణులకు సూచించారు. దీనివల్ల పర్యవరణానికి మేలు చేయడమే కాదు అందరికీ ఉపయోగపడే పని చేసినట్లు వుంటుందని మంత్రి పేర్కోన్నారు. దీంతో చాలామంది నాయకులు దాన్ని ఫాలో అవుతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios