హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిని కాటేశాడు. కూతురిపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాదులోని మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు 

ఓ వ్యక్తి (31) తన భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు అడపిల్లలు, ఓ కుమారుడు. నిందితుడి భార్య ఇళ్లలో పనిచేస్తుంది. మంగళవారం సాయంత్రం ఆమె బయటకు వెళ్లింది. తండ్రీపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. 

భార్య బయటకు వెళ్లగానే ఆ వ్యక్తి పెద్ద కూతురిని, కుమారుడిని బయటకు పంపించాడు. చిన్న కూతురిని మాత్రం లోపలే ఉంచి ఆమెపై అత్యాచారం చేశాడు. గంట తర్వాత భార్య వచ్చి తలుపులు తట్టింది. అతడు తలుపు తెరవగానే పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది. 

కూతురి పరిస్థితి గురించి ఆరా తీసింది. తండ్రి చేసిన పనిని కూతురు తల్లికి వివరించింది. దీంతో భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతన్ని రిమాండ్ కు తరలించారు.