Asianet News TeluguAsianet News Telugu

బాస్ మెయిల్‌కి అశ్లీల మెసేజ్‌లు, ఫోటోలు: కట్ చేస్తే.. ఉద్యోగే బ్లాక్ మెయిలర్

ఓ ఆన్‌లైన్ కంపెనీ మహిళా సీఈవోని సైబర్ వేధింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లతో సదరు మహిళా సీఈవోను లక్ష్మీకాంత్ బ్లాక్ మెయిల్ చేశాడు

employee harassed lady boss in hyderabad
Author
Hyderabad, First Published Feb 7, 2020, 3:11 PM IST

ఓ ఆన్‌లైన్ కంపెనీ మహిళా సీఈవోని సైబర్ వేధింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్లీల ఫోటోలు, మెసేజ్‌లతో సదరు మహిళా సీఈవోను లక్ష్మీకాంత్ బ్లాక్ మెయిల్ చేశాడు.

అతని వేధింపులతో విసిగిపోయిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే ఆ లక్ష్మీకాంత్ అనే వ్యక్తి ఆమె కింద పనిచేసే ఉద్యోగి. కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్ నగరంలోని బండ్లగూడలో స్థిరపడ్డాడు.

Also Read:వరుసగా రెండు ఫోన్లు: కంగారు పెట్టి, సిమ్ మార్పించి రూ.7 లక్షలు కొట్టేశారు

ఇతనికి పెళ్లయి భార్యా పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో న్యూ బోయిన్‌పల్లిలో ఉన్న ఓ లేడీస్ గార్మెంట్స్ డిజైనింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. దీనిని ఆ ప్రాంతానికే చెందిన ఓ మహిళ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో లక్ష్మీకాంత్ యువర్ మై బెస్ట్ లవర్ పేరుతో జీ మెయిల్ ఖాతా తెరిచి.. దీని ద్వారా తన యజమానికి ప్రేమ సందేశాలు పంపేవాడు. దీనిని అంతగా పట్టించుకోని ఆమెకు.. ఆ తర్వాత నుంచి అశ్లీల చిత్రాలు రావడం మొదలైంది.

Also Read:కేవైసీ అప్‌డేషన్ కోసం రూపాయి పంపమన్నారు: కట్ చేస్తే, 13 లక్షలు గోవిందా

ఇక ఉపేక్షేంచి లాభం లేదని భావించిన ఆమె సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ఐడీతో పాటు ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా లక్ష్మీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios