తలకు బాగా మత్తు ఎక్కితే ఏం చేస్తుమో, ఏం వాగుతున్నామో కూడా చెప్పలేం. అచ్చం అలాగే ఓ మందు బాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. పీకలదాకా తాగిన ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తూ ఎదురుగా కరెంట్ స్తంభం కనిపించడంతో అది ఎక్కి హల్ చల్ చేశాడు.

ఇలియాజ్ అనే వ్యక్తి సుమారు 30 అడుగుల ఎత్తైన పోల్ ఎక్కాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతనిని కిందకు దించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చుట్టే పరదాలు పరిచి పట్టుకున్నారు.

అయితే తనకు క్వార్టర్ బాటిల్ తెచ్చిస్తేనే కిందకు దిగుతానని తేల్చి చెప్పడంతో.... అతనిని కాపాడేందుకు పక్కనే ఉన్న బార్‌లోకి వెళ్లి మందు బాటిల్ తెచ్చి ఇలియాజ్‌ను కిందకు దించారు. కొద్దిసేపు జరిగిన ఈ హైడ్రామాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు చివరికి ఏం జరుగుతుందోనని జనం ఊపిరి బిగపెట్టి చూశారు. 

Also Read:

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.

భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు

అక్రమ సంబంధం పేరిట వేధిస్తున్నాడని....