హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ యువతి రోడ్డు దాటుతుండగా ఆమెను కారు ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని అలేఖ్యగా గుర్తించారు. కారు నడిపిన మహిళను ప్రణీతగా తెలుస్తోంది. 

రోడ్డు దాటుతుండగా అలేఖ్యను తొలుత ఓ బైక్ ఢీకొట్టింది. దాంతో ఆమె పడిపోయింది. ఆ స్థితిలో కారు ఆమెను ఢీకొట్టింది. ఆమెను దాదాపు  50 అడుగుల వరకు లాక్కెళ్లింది. 

ఆ సమయంలో కారును ప్రణీత అనే మహిళ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలు అయిన అలేఖ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగింది. 

అయితే ఈ ఘటనపై పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కారును నడిపిన మహిళను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.