హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర కారు ప్రమాదం సంభవించింది. ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. అయితే, ప్రమాదమేమీ సంభవించలేదు. ఎయిర్ బెలూన్స్ సహాయంతో అతను బయపడ్డాడు.

హైదరాబాదులోని కెపీహెచ్ బీ వద్ద ఓ లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

హైదరాబాదులో పలు చోట్ల లాక్ డౌన్ కారణంగా రద్దీ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రద్దీ పెద్ద యెత్తున ఉన్నట్లు తెలుస్తోంది.