నాచారంలోని ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. స్థానిక డీపీఎస్ స్కూలులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ ద్వారా సందేశం పంపాడు.

దీంతో స్కూలు యజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ హడావిడితో విద్యార్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.