హైదరబాద్ లో ఓ డెబ్బైఏళ్ల వృద్దుడు దారుణానికి ఒడిగట్టాడు. మనవరాలి వయసుండే ఓ  ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడి చేష్టలతో బయపడిపోయిన చిన్నారి గట్టిగా అరవడంతో ఈ మృగాడి నుండి తప్పించుకోగలిగింది. 

వివరాల్లోకి వెళితే... కుత్బుల్లాపూర్ అయోద్యనగర్ కాలనీకి చెందిన సోమయ్య(70) స్థానిక  ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే నివాసం వుంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా వుంటున్న అతడికి దారుణమైన ఆలోచన వచ్చింది. ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే ఓ ఐదేళ్ల చిన్నారికి  మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా గత నాలుగురోజులుగా ఇలాగే చేస్తున్నాడు.

read more  ఒంటిపై బంగారంతో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

అయితే అతడు ఏం చేస్తున్నాడో తెలీక బాలిక రోజూ అతడితో వెళుతోంది.  ఈ క్రమంలో సోమవారం మద్యాహ్నం మరోసారి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లిన సోమయ్య బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి ఆ కామాంధుడి నుండి బాలికను కాపాడారు.

అభం శుభం తెలియని బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సోమయ్యకు  దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని జీడిమెట్ల  పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.