సరైన పొజీషన్ లో కూర్చోకపోవడం, నిద్రపోవడం వల్ల మెడ, నడుము నొప్పి వస్తుంది. దీనివల్ల రోజు వారి పనులను కూడా సరిగ్గా చేసుకోలేం. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మెడ, నడుము నొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు.
బిజీ బిజీ లైఫ్ స్టైల్, నిద్రపోయే పొజీషన్స్, డెస్క్ వర్క్ చేయడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరం లోపలి నుంచి బలహీనంగా మారుతుంది. దీని వల్ల ఒళ్లు నొప్పులు, అలసట, శరీరంలో బలహీనత వంటి సమస్యలు వస్తాయి.
వీటితో పాటు మెడ, నడుము బిగుసుకుపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. తప్పు భంగిమలో కూర్చోవడం లేదా నిద్రపోవడం వల్ల నడుము, మెడ నొప్పి వస్తుంది. దీని వల్ల మీరు లేవడం, కూర్చోవడం, మీ రోజువారీ పనులను చేయడానికి కూడా చేతకాదు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అదెలాగంటే..
టెన్నిస్ బంతితో మసాజ్
టెన్నిస్ ఆడే టెన్నిస్ బాల్ కూడా మెడనొప్పి, వెన్ను నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. రీసెర్చ్ గేట్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కండరాల దృఢత్వం నుంచి ఉపశమనం పొందడానికి టెన్నిస్ బంతి ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది. ఒక టెన్నిస్ బంతిని తీసుకొని నొప్పి ఉన్న దగ్గర 15 నుంచి 20 సెకన్ల పాటు ఒత్తిడిని పెంచండి. అలాగే నొప్పి ఉన్న ప్లేస్ లో బాల్ ను తిప్పుతూ మసాజ్ చేయండి.
గోరువెచ్చని నూనెతో మసాజ్
గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసినా నొప్పి బాగా తగ్గుతుంది. నొప్పికి ప్రధాన కారణం శరీరంలోని ఆ భాగంలో రక్త ప్రసరణ ఆగిపోవడం. అదే గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల నిలిచిపోయిన రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇది మీ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో కొద్దిగా ఆవనూనె, సెలెరీ, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి గోరువెచ్చగా చేసుకోవాలి. ప్రభావిత ప్రాంతంలో 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి.
ఐస్ ప్యాక్
మీ మెడ, నడుము భాగంలో ఎక్కువ నొప్పి ఉంటే ఐస్ ప్యాక్ ను ట్రై చేయండి. ఇది మీకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఊస్ ప్యాక్ నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఐస్ ప్యాక్ లేదా టవల్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి 15 నిమిషాలు ఆ ప్లేస్ లో పెడితే మంచి ఉపశమనం కలుగుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
పబ్మెడ్ సెంట్రల్ ఆపిల్ వెనిగర్ పై పరిశోధన ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక తాపజనక ఆహారం. దీన్ని తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇదినొప్పిని, ఒత్తిడిని తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక కాటన్ ప్యాడ్ను నానబెట్టి ప్రభావిత ప్రాంతంలో ఒక గంట పాటు ఉంచండి. దీన్ని రెండు రోజుల్లో రెండు మూడు సార్లు చేయండి.
