Asianet News TeluguAsianet News Telugu

జస్ట్ మీ మూత్రం రంగు చాలు మీకు ఏయే రోగాలు ఉన్నాయో చెప్పడానికి..!

అవును మూత్రం రంగు బట్టి మనకు ఎలాంటి రోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. అందుకే మూత్రం రంగును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. 
 

Urine colour may signal health problems rsl
Author
First Published Mar 19, 2023, 10:35 AM IST

మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, అదనపు నీరు మూత్రం రూపంలో బయటకు పోతుంది. మూత్రం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రం మూత్ర వ్యవస్థ గుండా వెళుతుంది. అయితే ఇది మన శరీరంలోంచి బయటకు వెళ్లే ముందు రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్ చేసే మూత్రపిండాలను కలిగున్న మార్గం.  ఇది ఎన్నో అనారోగ్య సమస్యను నిర్ధారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి మన మూత్రం రంగు మన అంతర్గత ఆరోగ్యం గురించి చెబుతుంది. మూత్రం రంగు ఎరుపులో ఉంటే మనకు క్యాన్సర్ ఉండొచ్చు. అయితే మనం తినే ఆహారాలు, వేసుకునే మందుల వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది. అయితే ఏ రంగు ఎలాంటి అనారోగ్య సమస్యలను తెలుపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

లేత పసుపు రంగు మూత్రం

మన శరీరం ఉత్పత్తి చేసే యురోబిలిన్ వర్ణద్రవ్యం కారణంగా.. మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అయితే మీరు ఎంత నీటిని తాగుతున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మూత్రం రంగు లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగు వరకు ఉండొచ్చు. మీ శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మీ మూత్రపిండాలు మూత్రం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయి. అంటే వేడిలో వ్యాయామం చేసిన తర్వాత నీటి సమతుల్యతను అదుపులో ఉంచడానికి నీరు తిరిగి శరీరానికి వస్తాయి. 

రంగులేని మూత్రం

మీరు మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని తాగినప్పుడు మీ మూత్రం ఎలాంటి రంగు ఉండదు. అంటే మీ మూత్రపిండాలు అదనపు నీటిని రంగులేని మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం తగినంత హైడ్రేటెడ్ గా ఉంటే మన మూత్రం ఎలాంటి రంగులో ఉండదు. 

ముదురు పసుపు రంగు మూత్రం

కామెర్లు ఉంటే మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు, సల్ఫాసలాజైన్ లేదా ఫెనాజోపైరిడిన్ వంటి మందులను ఉపయోగించినప్పుడు మీ మూత్రం ముదురు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.

ఎర్రటి మూత్రం

కొన్నికొన్ని సార్లు మూత్ర మార్గంలో అంతర్గత రక్తస్రావం జరుతుంది. దీనివల్ల మూత్రం ఎరుపు రంగులో ఉంటుంది. రాళ్ళు, క్యాన్సర్ లేదా సంక్రమణ కారణంగా కూడా మూత్రం ఎరుపురంగులో ఉంటుంది. గ్లోమెరులోనెఫ్రిటిస్ అని పిలువబడే ప్రాధమిక గ్లోమెరులర్ రుగ్మతల వల్ల కూడా మూత్రం ఎర్రగా వస్తుంది. 

ముదురు గోధుమ రంగు మూత్రం

ముదురు గోధుమ రంగు మూత్రాన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మూత్రాశయం లేదా మూత్రపిండాల క్యాన్సర్ కు మొదటి సూచన కావొచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర మార్గము అంటువ్యాధులు కూడా ఇందుకు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. నిర్జలీకరణం, మూత్ర మార్గ సంక్రమణ లేదా దీర్ఘకాలిక మూత్ర కాథెటర్ వాడకం అన్నీ ముదురు రంగు మూత్రానికి దారితీస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios