చాలా మందికి పీరియడ్స్ ఫస్ట్ డేనే నొప్పి వస్తుంది. అయితే కొంతమందికి రెండో రోజు కూడా నొప్పి కలుగుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ నొప్పిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
మొదటి రోజే నొప్పిని భరించడం కష్టం. అందులో రెండో రోజూ కూడా పీరియడ్స్ నొప్పితో విలవిలలాడటం ఇంకా కష్టం. పీరియడ్స్ మొదటి రోజుతో పాటుగా రెండో రోజూ కూడా నొప్పి కలగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భాశయంలోని కండరాలు సంకోచించడం వల్ల గర్భాశయానికి రక్తం సరఫరా, ఆక్సిజన్ ను సరిగ్గా వెళ్లదు. గర్భాశయానికి ఆక్సిజన్ సరిగ్గా సరఫరా కాకుంటే ప్రొస్టాగ్లాండిన్స్ వంటి నొప్పిని ప్రేరేపించే రసాయనాలు విడుదల అవుతాయి. ఇది గర్భాశయ సంకోచాలను పెంచుతుంది. ఈ రకమైన పీరియడ్ నొప్పి రెండో రోజూ కూడా వస్తుంది. దీనిని డిస్మెనోరియా అంటారు. ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
హాట్ బ్యాగ్స్
పొత్తికడుపుపై హాట్ బ్యాగ్స్ ను పెడితే కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి కండరాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. కడుపు తిమ్మిరి నుంచి కూడా ఇది సహాయపడుతుంది.
కెఫిన్ తీసుకోవడం తగ్గించండి
చాలా మంది కాఫీని ఎక్కువగా తాగుతుంటారు. కానీ పీరియడ్స్ సమయంలో దీనిని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే కెఫిన్ మీ రక్త నాళాలను ఇరుగ్గా చేస్తుంది. ఇది మీ గర్భాశయం సంకోచించేలా చేస్తుంది. ఇది విపరీతమైన తిమ్మిరికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
అజ్వైన్
అజ్వైన్ జీర్ణ సమస్యలను నయం చేయడమే కాకుండా.. పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్, ఫైబర్, సాపోనిన్లు, కాల్షియం, ఇనుము, అయోడిన్, మాంగనీస్, థయామిన్ వంటి ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇది పొత్తి కడుపునొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఎండాకాలం ఆహారాలు
డార్క్ చాక్లెట్, అవోకాడో, సాల్మన్, ఆకుకూరలు, బ్రోకలీ వంటి కొన్ని ఆహారాలు తినడం వల్ల కూడా నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఈ ఆహారాలు మంటను తగ్గించడానికి, రుతుక్రమ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి.
హైడ్రేట్ గా ఉండండి
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాటర్ ను తాగకపోతే ఉబ్బరం ఏర్పడుతుంది.ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీంతో పీరియడ్స్ తిమ్మిరిని మరింత ఎక్కువ అవుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మీ శరీరమంతా రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది మీ కండరాలను సడలిస్తుంది. అందుకే పీరియడ్స్ టైం లో కూడా నీటిని పుష్కలంగా తాగండి.
హెర్బల్ టీ
నీటితో పాటు మూలికా టీలు కూడా గర్భాశయంలో సంకోచాలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలోని శోథ నిరోధక లక్షణాలు తిమ్మిరిని తగ్గిస్తాయి. అలాగే విశ్రాంతిని కలిగించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం ఫెన్నెల్ టీ, అల్లం టీ, చామంతి టీ లను తాగొచ్చు.
వ్యాయామం
వ్యాయామం కూడా తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే వ్యాయామం శరీరం సహజ నొప్పి నివారిణి అని కూడా పిలువబడే బీటా-ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల రక్తం సజావుగా ప్రవహిస్తుంది.
పెయిన్ కిల్లర్
పీరియడ్స్ లో భరించలేని నొప్పి కలిగితే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ ను తీసుకోండి. పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి శోథ నిరోధక పెయిన్ కిల్లర్లను ఉపయోగించొచ్చు. ఈ నొప్పి నివారణలు మీ గర్భాశయానికి ఎలాంటి హాని చేయదు. అలాగే వంధ్యత్వానికి కారణం కావు.
