ఫుడ్ ను తక్కువగా తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీనివల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది మీ బరువు తగ్గే ప్రయాణానికి కూడా అంతరాయం కలిగిస్తుంది.
అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అండర్ ఈటింగ్ అని ఒకటి ఉందన్న సంగతి మీకు తెలుసా? తక్కువ ఆకలి లేదా తక్కువగా తినడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలొస్తాయో తెలుసా? నిజానికి తక్కువగా తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు, కేలరీలు అందవు. దీంతో ఈ లోపాలు ఏర్పడుతాయి. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి కూడా అంతరాయం కలిగిస్తుంది. మీరు తగినంతగా తినడం లేదని, మీ శరీరానికి ఎక్కువ ఆహారం అవసరమని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ శక్తి స్థాయిలు
చాలా తక్కువ కేలరీలను తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల వ్యాయామం చేయడానికి లేదా మీ రోజువారి పనులను చేసుకోవడానికి, ఇతర పనులను చేయడానికి సరిపడా శక్తి మీ దగ్గర ఉండదు. దీనివల్ల మీకు బాగా అలసట వస్తుంది.
జుట్టు రాలుతుంది
కేలరీలు, ప్రోటీన్, కొన్ని సూక్ష్మపోషకాలు మన శరీరాలకు చాలా చాలా అవసరం. ఒకవేళ ఇవి మీ శరీరంలో లోపిస్తే మ జుట్టు రాలడం మొదలవుతుంది.
నిరంతర ఆకలి
తక్కువ తినడం వల్ల హార్మోన్లలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది తగినంత కేలరీలు, పోషకాలను మీ శరీరంలో భర్తీ చేయడానికి మీకు ఆకలిని పెంచుతుంది.
నిద్ర సమస్యలు
తక్కువ తినడం నాణ్యమైన నిద్రతో ముడిపడి ఉంది. తక్కువ తినడం వల్ల నిద్రపోవడానికి మీరు ఇంకా ఎక్కువ సమయం తీసుుకుంటారు. కొద్దిసేపు మాత్రమే గాఢంగా నిద్రపోతారు.
చిరాకు
దీర్ఘకాలికంగా తక్కువ కేలరీల తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఇది మీకు చిరాకును కూడా కలిగిస్తుంది.
ఎల్లప్పుడూ చల్లగా అనిపిస్తుంది
చాలా తక్కువ కేలరీలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది తక్కువ స్థాయి టి 3 థైరాయిడ్ హార్మోన్ వల్ల కావొచ్చంటున్నారు నిపుణులు.
మలబద్ధకం
కఠినమైన డైటింగ్, తక్కువ తినడం వల్ల మలబద్దకం సమస్య కూడా వస్తుంది. మలం ఏర్పడటానికి తక్కువ వ్యర్థ ఉత్పత్తి, జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం నెమ్మదిగా కదలడమే ఇందుకు కారణం.
పేలవమైన జ్ఞానం
బి విటమిన్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్లు వంటి పోషకాలు లేకపోవడం వల్ల మెదడు పనితీరు, అభిజ్ఞా సామర్థ్యం క్షీణిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
