అడవి పసుపును ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. అడవి పసుపును ఎన్నో రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. అసలు ఇది ఏయే రోగాలను తగ్గిస్తుందో తెలుసా?  

అడవి పసుపును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పసుపు రూట్ శారీరక శక్తిని పెంచడం, గ్యాస్ ను తగ్గించడం, నులి పురుగులను వదిలించుకోవడం, జీర్ణక్రియను పెంచడం, రుతుస్రావాన్ని నియంత్రించడం, పిత్తాశయ రాళ్లను తొలగించడం, ఆర్థరైటిస్ ను తగ్గించడం వంటి ఎన్నో ఔషధ ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలో.. యాంటీ మైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కోసం పసుపు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఈ పసుపు కర్పూరం లాంటి వాసనను కలిగి ఉంటుంది. అసలు ఈ అడవి పసుపు మనకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

అడవి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుస్కలంగా ఉంటాయి. ఇది దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. గ్లాస్ నీటిని చిటికెడు పసుపు వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగితే సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ఈ హెర్బ్ లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా కాపాడుతాయి. కణితి కణాల పెరుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఈ పసుపు మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలా అంటే ఈ పసుపు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్లను అణిచివేస్తుంది. అలాగే అలెర్జీ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. టీ కణాలు, బీ కణాలు, సహజ కిల్లర్ కణాలు అన్నీ కర్కుమిన్ ద్వారా ప్రభావితమవుతాయి. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది.

గాయాలను నయం చేస్తుంది

అడవి పసుపులోని సహజ వైద్య లక్షణాలు గాయాలు, చిన్న చిన్న తెగిన గాయలు, మచ్చలు, పాము కాటుకు చికిత్స చేయడానికి సహాయపడతాయి. ఇవి వైద్యం ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మచ్చ కణజాలాన్ని కూడా తగ్గిస్తాయి. అడవి పసుపు దోమల నివారిణి లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. దోమ కాటును నయం చేస్తుంది.

కాలేయ నిర్విషీకరణ

పసుపు ఒక విలువైన సమ్మేళనం. ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్ తో కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. మూత్రపిండాలు, గుండె, మెదడును కూడా రక్షిస్తుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, చిత్తవైకల్యం, హంటింగ్టన్'స్ వ్యాధితో సహా వివిధ రకాల నాడీ సమస్యలను తగ్గించడానికి ఈ హెర్బ్ సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ ను నివారిస్తుంది

పసుపు ఒక శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, న్యూరోప్రొటెక్టివ్ పదార్థం. ఇది ఆర్థరైటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కుమిన్ తాపజనక, ఆర్థరైటిస్ సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది. దీనిని మసాలా దినుసుగా తినొచ్చు, టీకి జోడించవచ్చు లేదా సప్లిమెంట్ గా తీసుకోవచ్చు.

చర్మానికి మంచిది

ఈ సుగంధ మూలికను శతాబ్దాలుగా మనదేశంలో సహజ సౌందర్య పదార్ధంగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ట్యాన్ ను తొలగిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. జిడ్డుగల చర్మాన్ని తొలగిస్తుంది. వృద్ధాప్యంతో పోరాడుతుంది. ముఖంపై ఉండే వెంట్రుకలను కూడా తొలగిస్తుంది.