Asianet News TeluguAsianet News Telugu

అకస్మాత్తుగా బీపీ ఎందుకు పెరుగుతుందో తెలుసా?

అధిక రక్తపోటు ఉన్నవారిలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. మైకం, తలనొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, తలనొప్పి వంటివన్నీ అధిక రక్తపోటుకు సంకేతాలు. 
 

reasons behind sudden increase in blood pressure rsl
Author
First Published Apr 29, 2023, 4:42 PM IST

కొందరిలో రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలా ఉన్నపాటుగా రక్తపోటు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. పలు నివేదికల ప్రకారం.. సుమారు 32% మంది అమెరికన్లు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. బీపీ ఎక్కువగా ఉండేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముక్కు నుంచి రక్తస్రావం, మైకము, తలనొప్పి హై బీపీ ప్రధాన లక్షణాలు. బీపీ పెరగడంలో భాగంగా ఛాతీలో అసౌకర్యం, అలసట, ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి. అసలు బీపీ అకస్మత్తుగా ఎందుకు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పొగాకు

పొగాకు వాడకం వల్ల కూడా రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. ధూమపానం, పొగాకు నమలడం వల్ల కూడా రక్తపోటు స్థాయిలు బాగా పెరుగుతాయి. పొగాకును వాడితే క్యాన్సర్ తో సహా ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

కెఫిన్

మీకు సాధారణ రక్తపోటు ఉన్నప్పటికీ కెఫిన్ వినియోగం రక్తపోటును పెంచుతుంది. రక్తపోటు పెరగడానికి అసలు కారణమేంటో ఖచ్చితంగా తెలియనప్పటికీ.. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. మీరు కెఫిన్ కంటెంట్ పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదా తగ్గించాలి. 

మందులు

మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. మీరు మందుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నాన్స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రమాదకరం.

ఒత్తిడి

మానసిక ఒత్తిడి కూడా రక్తపోటు పెరిగేందుకు కారణమవుతుంది. పనిలో ఒత్తిడి, పరీక్షలు వంటి అనేక కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడికి కారణం వ్యక్తికి వ్యక్తికి మారుతుంది.

మద్యం 

ఆల్కహాల్ తాగడం వల్ల కూడా రక్తపోటు స్థాయిలు ఉన్నపాటుగా పెరుగుతాయి. ఇదొక్కటే కాదు మందును మోతాదుకు మించి తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios