ప్రస్తుత రోజుల్లో అందరూ కామన్  వేసుకునే డ్రెస్ జీన్స్. అమ్మాయి, అబ్బాయి, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జీన్స్ వేసుకుంటున్నారు. అందరికీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీనిని ప్రిఫర్ చేస్తారు. అయితే...  ఈ జీన్స్ వేసుకున్న తర్వాత చేసే కొన్ని పనులు అనారోగ్యానికి దారి తీస్తున్నాయట. ఈ విషయాన్ని నిపుణులు స్వయంగా వెల్లడించారు.

జీన్స్‌ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్‌ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం  ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్‌ ప్యాంట్‌ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే  ఒక్కోసారి జీన్స్‌ ప్యాంట్లతో బాసిపట్లు  వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా వచ్చేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్‌ వేసుకొని ‘స్క్వాటింగ్‌’ అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్‌ ఆఫ్‌ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.