నొప్పిని తగ్గించడానికి కేవలం మెడిసిన్స్ ను మాత్రమే వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని వంటింటి పదార్థాలతో కూడా నొప్పిని చాలా సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
మన శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిగా అనిపించొచ్చు. అయితే కొంతమందికి తరచుగా ఇలాంటి నొప్పి వస్తుంటుంది. మెడిసిన్స్ ను వాడితే నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. కానీ కొన్ని వంటింటి పదార్థాలతో కూడా ఈ నొప్పిని తగ్గించుకోచ్చు తెలుసా? అంతేకాదు ఇవి మీరు దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలను కలిగించే యాంటీబయాటిక్స్ ను తీసుకోకుండా కాపాడుతాయి. నొప్పిని తగ్గించడానికి ఎలాంటి వంటింటి పదార్థాలను వాడాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం
నొప్పి నివారణకు ఉపయోగించే సహజ పదార్థాల్లో అల్లం ఒకటి. ఇది మన శరీర మంటను తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అందుకే దీన్ని నొప్పి నివారణా పదార్థం అంటారు. అల్లం వికారం, వాంతులను కూడా తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పంటి నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా దీన్ని వాడుతారు. అల్లం గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చలనశీలత, మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది.
పసుపు
పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పసుపు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి ప్రసిద్ది చెందింది. పసుపులో ఉండే కర్కుమిన్ లో నొప్పిని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శోథ నిరోధక ఆహారం కాబట్టి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, శస్త్రచికిత్స అనంతర మంట, వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, కడుపు పూతల చికిత్సకు సహాయపడుతుంది. పసుపు కాలేయ పనితీరును పెంచడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
టార్ట్ చెర్రీ
ఫైటోన్యూట్రియెంట్స్, సేంద్రీయ ఆమ్లాలు, ఎన్నో కెరోటినాయిడ్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. చెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి, మెలటోనిన్ లు కూడా ఉంటాయి. చెర్రీలను తినడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ జ్యూస్ ను తాగితే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది.
పిప్పరమింట్ నూనె
ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తో బాధపడుతున్న వారికి పిప్పరమింట్ ఆయిల్ అద్భుతమైన నొప్పి నివారణగా పనిచేస్తుంది. కానీ మీకు యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉంటే దీనిని ఉపయోగించకపోవడమే మంచిది.
ఒరేగానో నూనె
ఒరేగానో నూనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది జీర్ణ సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల కలిగే నొప్పి నుంచి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ సహజంగా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది నొప్పిని తగ్గించడానికి, బాగా నిద్రపోవడానికి, ఆందోళన, ఒత్తిడి లక్షణాలను తగ్గించడానికి లావెండర్ నూనె మంచి ప్రయోజకరంగా ఉంటుంది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను పీల్చడం వల్ల మైగ్రేన్ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.
