ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. ఒత్తిడి మానసిక సమస్యలనే కాదు శారీరక సమస్యలకు కూడా దారితీస్తుంది. ఒత్తిడి నిద్రలేమి సమస్యకు కూడా దారితీస్తుంది.
ఒత్తిడి, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఒత్తిడే నిద్రలేమికి అసలు కారణం. నిద్రలేమి ఎన్నో శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. శరీరం సక్రమంగా పనిచేయాలంటే వయోజనులు రోజుకు కనీసం ఏడెనిమిది గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలి. తగినంత నిద్ర రాకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. బలహీనంగా ఉంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. పనిమీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంతేకాదు నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నాణ్యత లేని నిద్ర మీ గుండె, మూత్రపిండాలు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. అయితే కొన్ని జీవనశైలి చిట్కాలతో ఒత్తిడిని తగ్గించి రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవేంటంటే..
ఆహారపు అలవాట్లు
నిపుణుల ప్రకారం.. నిద్రపోవడానికి ముందు అరటిపండు, గుమ్మడికాయ విత్తనాలు లేదా బాదం లేదా చామంతి టీని తాగడం మంచిది. ఎందుకంటే ఇవి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడతాయి.
గింజలు
ఆరోగ్యకరమైన నిద్ర కోసం బాదం, వాల్ నట్స్, పిస్తా, జీడిపప్పును రోజూ గుప్పెడు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారంలో మెలటోనిన్, ఇతర ఖనిజాలు ఉన్న సప్లిమెంట్లను ఉపయోగించే క్లినికల్ ప్రయోగంలో నిద్రలేమి ఉన్న వృద్ధులలో గింజలు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని నిరూపించబడింది.
డిన్నర్ సమయం
ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా హాయిగా పడుకోవాలంటే తినడానికి, పడుకోవడానికి చాలా గ్యాప్ ఉండాలి. మీరు ప్రశాంతంగా పడుకోవాలంటే.. రాత్రి డిన్నర్ కు పడుకోవడానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి.
వ్యాయామం
వ్యాయామం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో ప్రమాదకరమైన రోగాల ముప్పు కూడా తప్పుతుంది. రోజూ వ్యాయామం చేస్తే మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే మీరు రోజూ వ్యాయామం చేయలేకపోతే వారానికి కనీసం 4 రోజులైనా వ్యాయామం చేయండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
హైడ్రేటెడ్ గా ఉండండి
డీహైడ్రేషన్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. దీనివల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగండి.
విటమిన్ స్థాయిలను తనిఖీ చేయండి
మన శరీరం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో విటమిన్లు పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి 12 స్థాయిలను తనిఖీ చేస్తూ ఉండండి. ఇవి కూడా శరీరానికి చాలా అవసరం. ఇవి లోపిస్తే మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది.
సూర్యకాంతి
ఉదయపు సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు నిలబడండి. సూర్యరశ్మి విటమిన్ డి కి సహజ మూలం. ఈ విటమిన్ డి మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోవడమే కాదు మీ ఎముుకలను కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
