డయాబెటీస్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు వీళ్ల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. మరి మధుమేహులు శెనగపిండిని తినొచ్చా?
మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. అయితే మధుమేహులు ఈ పండ్లు తినాలి? వీటిని తినకూడదు, ఈ కూరగాయలను తినాలి, ఈ కూరగాయలను తినకూడదని చెప్తుంటారు. మరి ఏ పిండిని తినాలో? దేన్ని తినకూడదో చాలా మందికి తెలియదు. అయితే డయబెటీస్ పేషెంట్లు శెనగపిండిని తినాలో? వద్దో? అనే దానిపై ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. మరి దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
శెనగపిండిలో చక్కెర ఉంటుందా?
శెనగలను గ్రైండ్ చేసి తయారు చేసే శనగపిండిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శెనగల జిఐ 6 మాత్రమే. కానీ శెనగలతో తయారైన శనగ పిండి జిఐ 10. అంటే దీన్ని తినడం వల్ల మధుమేహులకు ఎలాంటి సమస్యలు రావు.
డయాబెటిస్ లో శెనగపిండి ఎప్పుడు హానికరం?
డయాబెటిస్ పేషెంట్లు శెనగపిండితో చేసిన స్నాక్స్ ను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా శనగపిండితో చేసిన పకోడీలు, శనగపిండి బజ్జీలు వంటి స్నాక్స్ ను తింటే మంచిది కాదు. ఎందుకంటే ఈ స్నాక్స్ లో జీఐ ఇండెక్స్ 28-35 వరకు ఉంటుంది. వీటిని తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరుగుతాయి. అందుకే శెనగ పిండితో చేసిన వీటిని తినడం మంచిది కాదు.
డయాబెటిస్ పేషెంట్లు శెనగపిండి ఎలా తినాలి?
డయాబెటిస్ పేషెంట్లు ముందుగా ఇంట్లో తయారుచేసిన శెనగపిండినే తినాలి. శెనగలను కొని వాటిని మీరే గ్రైండ్ చేసి పిండిని తయారుచేయండి. అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త ముతకగా ఉంచండి. అయితే శనగపిండి స్నాక్స్ తినడానికి బదులుగా శనగపిండి రోటీని తినండి. ఇది డయాబెటిస్ రోగులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే శనగపిండి పకోడాలకు బదులుగా శనగపిండి రోటీని తినండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా డయాబెటిస్ ఇతర లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.