ఆరోగ్యకరమైన ఆహారాల్లో నెయ్యి కూడా ఒకటని భావిస్తుంటారు. దీనిలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ.. సంతృప్త కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు వాదిస్తున్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి నెయ్యిని వాడుతున్నారు. దీనిలోని మంచి వాసన, రుచి వివిధ వంటకాల రుచిని పెంచుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని నమ్ముతారు. కొంతమంది నెయ్యి పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన సూపర్ ఫుడ్ అని పేర్కొంటారు. అయితే కొందరు దీనిని తినడం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ఎందుకంటే దీనిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నమ్ముతారు.
నెయ్యిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు, తక్కువ మొత్తంలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు నెయ్యిలో ఉంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ దీనిలో సంతృప్త కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుందని దీనిని తినని వారు చాలా మందే ఉన్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంతృప్త కొవ్వులు కొంతమందిలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచినప్పటికీ గుండె ఆరోగ్యంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని స్ఫష్టంగా తెలియదు. వాస్తవానికి సంతృప్త కొవ్వులను శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో భర్తీ చేయడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. నెయ్యిలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం (సిఎల్ఎ) కూడా ఉంటుంది. ఇది మంటను తగ్గించడం, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
అయినప్పటికీ.. నెయ్యిని ఎక్కువగా తింటే బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని గుర్తుంచుకోవాలి. అన్ని ఆహారాల మాదిరిగానే నెయ్యిని కూడా మితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు వంటి కొన్ని రోగాలు ఉన్న వ్యక్తులు నెయ్యితో సహా సంతృప్త కొవ్వుల వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి.
నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. దీనిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సిఎల్ఎ కంటెంట్ కారణంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నెయ్యి లాక్టోస్ లేనిదా?
అవును నెయ్యి లాక్టోస్ లేనిది. ఎందుకంటే క్లారిఫికేషన్ ప్రక్రియ సమయంలో పాల ఘన పదార్థాలు తొలగించబడతాయి. ఇది లాక్టోస్,కేసైన్ ను తొలగిస్తుంది. అయినప్పటికీ మీకు తీవ్రమైన లాక్టోస్ అసహనం ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే నెయ్యిని తీసుకోవాలి.
నెయ్యిని ఎక్కువ కాలం నిల్వ ఉంటుందా?
నెయ్యి ఎక్కువగా నిల్వ ఉంచొచ్చు. ఇది అంత తొందరగా పాడవదు. ముఖ్యంగా సరిగ్గా నిల్వ చేసినప్పుడే. నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దీనికి సూర్యరశ్మి తగలకూడదు. గాలి వెల్లకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే ఇది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
