గులాబీలను ‘పువ్వుల్లో రాణి’ అని కూడా అంటారు. గులాబీలను ప్రేమకు, అందానికి చిహ్నంగా పరిగణిస్తారు. మనకు తెలియని విషయం ఏంటంటే.. ఈ గులాబీలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 

లవ్ ప్రపోజ్ చేయడానికి, ఒకరిని విష్ చేయడానికి ఇలా చాలా సందర్భాల్లో గులాబీ పువ్వులను ఇచ్చిపుచ్చుకుంటారు. నిజానికి గులాబీ పువ్వులు చాలా చాలా అందంగా ఉంటాయి. అందుకే ఈ పువ్వులను పువ్వుల రాణి అంటారు. అన్ని రకాల పువ్వుల్లో వీటినే ఎక్కువగా ఇష్టపడతారు. గులాబీలను, అందానికి, ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. నిజమేంటంటే.. ఇవి అందంగా ఉండటమే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 

అవును గులాబీ పువ్వులు ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. వృద్ధాప్యాన్ని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మూసుకుపోయిన రంధ్రాలను తెరవడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చడానికి, స్కిన్ టోన్ ను మెరుగుపర్చడానికి, ప్రకాశవంతమైన రూపాన్ని ఇవ్వడానికి గులాబీ పువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఈ పువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అవసరమైన విటమిన్లు కూడా ఉంటాయి. ఆకర్షణీయమైన సువాసన, అందాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగున్న ఈ గులాబీలు నిరాశ, దగ్గు, జలుబు, కడుపు సమస్యలు, తలనొప్పి, మైకము వంటి అనారోగ్య సమస్యలను తొలగించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

గులాబీలు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉండటమే కాదు దీనిలో కేలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఈ గులాబీ రేకులను టీ, జాములు, ఊరగాయలు, సిరప్లు, ఐస్ క్రీములు, సలాడ్లు, ఇతర పానీయాలు లేదా ఆహారాల తయారీలో బాగా ఉపయోగిస్తారు. ఈ గులాబీ రేకుల్లో ఉండే ఔషదగుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాదు రుచిని కూడా పెంచుతాయి. దీని ప్రయోజనాలను పొందడానికి గులాబీలను ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోజ్ సిరప్: తీయని వివిధ రకాల పానీయాలతో పాటుగా పేస్ట్రీలలో కూడా రోజ్ సిరప్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రోజ్ సిరప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గులాబీల అద్భుతమైన వాసనను కలిగి ఉంటుంది. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులువు. 

జామ్ లు, జెల్లీలు: గులాబీ రేకులు తాజాగా ఉన్నా.. అవి ఎండినా.. వీటిని ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. వీటితో తీపి, పూల రుచితో టేస్టీ టేస్టీ జామ్ తయారుచేయొచ్చు. రోజ్ ను బ్రెడ్, క్రోసెంట్స్, బక్లావా లేదా ఐస్ క్రీమ్ పైన జెల్లీగా కూడా తినొచ్చు.

గార్నిష్: తాజా గులాబీ రేకులను కాల్చిన వస్తువులు, సూప్లు, మాక్టైల్స్ వంటి మద్య పానీయాలకు గార్నిష్ గా ఉపయోగించొచ్చు. వీటిని ఈ గులాబీ రేకులు టేస్టీగా మారుస్తాయి. గులాబీ రేకులు వీటికి మరింత తీయదనాన్ని జోడిస్తాయి. అయితే మీరు కొత్తదనాన్ని కోరుకుంటే గులాబీ రేకులను వివిధ ఆకారాల ఐస్ క్యూబ్ లుగా స్తంభింపజేయొచ్చు.

హెర్బల్ టీ: గులాబీ రేకులను, మొగ్గలను ఎన్నో సువాసనగల మూలికా పానీయాలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే వీటిలో కొన్ని తీయగా, మరికొన్ని చేదుగా ఉంటాయి. అలాగే ఎండిన గులాబీ రేకులను వేడినీళ్లలో మరిగించి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. రోజ్ టీలోని పాలీఫెనాల్స్ సెల్యులార్ క్షీణత, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, అభిజ్ఞా రుగ్మతల నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి.