డయాబెటీస్ ను పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అందుకే ఇది రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఈ వ్యాధిని మొదట్లోననే గుర్తించాలి. అప్పుడే వీళ్లకు డయాబెటీస్ తో ఇతర రోగాల ముప్పు తప్పుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇదొక జీవక్రియ రుగ్మత. ఇది మీ శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉపయోగించలేనప్పుడు వస్తుంది. ఇన్సులిన్ ఒక హార్మోన్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే మీ కణాలు శక్తి కోసం గ్లూకోజ్ ను ఉపయోగించడానికి సహాయపడుతుంది. అయితే డయాబెటీస్ మొదటి సంకేతాలు తేలికపాటివిగా ఉంటాయి. అందుకే ఈ లక్షణాలను పెద్దగా పట్టించుకోరు. అసలు డయాబెటీస్ ను మొదట్లోనే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దాహం, మూత్రవిసర్జన పెరగడం

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మీ శరీరం కణజాలాల నుంచి ద్రవాలను బయటకు పంపుతుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీంతో మీకు తరచుగా దాహంగా అనిపిస్తుంది. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేస్తారు. 

అలసట, బలహీనత

మీ శరీరం గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించలేకపోవడం డయాబెటీస్ వస్తుంది. ఇది మీ ఒంట్లో శక్తిని తగ్గిస్తుంది. కంటినిండా నిద్రపోయిన తర్వాత కూడా మీరు అలసిపోయినట్టుగా భావిస్తారు. అలాగే ఏకాగ్రత కూడా ఉండదు. 

బరువు తగ్గడం

డయాబెటిస్ ఉన్నవారు కూడా బరువు తగ్గుతారు. అలాగే కంటిచూపు కూడా సరిగ్గా ఉండదు. గాయాలను నెమ్మదిగా మానుతాయి. అంటువ్యాధులు కూడా సోకుతుంటాయి. ముఖ్యంగా చిగుళ్లు, మూత్ర మార్గములో..

అయితే డయాబెటిస్ నునివారించడానికి, దాని లక్షణాలను సమర్థవంతంగా తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. డయాబెటిస్ ను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం. సమతుల్య ఆహారాన్ని అనుసరించడం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం. అలాగే ఆరోగ్యకరమైన శరీర బరువును కొనసాగించడం. ఇవి మిమ్మల్ని డయాబెటీస్ నుంచి రక్షిస్తాయి. 

డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచాలంటే సమతుల్య ఆహారం చాలా అవసరం. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి.