తినడానికి టైం కూడా లేని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఫుడ్ ను స్కిప్ చేయడం వల్ల మీరు ఎక్కువ సేపు వర్క్ చేయలేరు. దీనివల్ల ఒత్తిడి పెరగడం, తలనొప్పి, నీరసంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
వర్క్ కు టైం అవుతోంది.. ఇప్పుడు తినడం కుదరదని ఏపూటకు ఆపూట ఫుడ్ ను స్కిప్ చేస్తుంటారు కొందరు. మీరెంత బిజీ బిజీగా సమయాన్ని గడుపుతున్నా... సమయానికి పక్కాగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సమయం లేదని ఫుడ్ ను స్కిప్ చేస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏ పని చేయడానికి కూడా చేతకాదు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో మనసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పనులను చేసేందుకు శక్తి మీలో ఉండదు. అలాగే ఒత్తిడి పెరుగుతుంది. ఇది డిప్రెషన్ కు దారితీస్తుంది.
మీకు తెలుసా? భోజనాన్ని చేయకపోవడం వల్ల మీలో కోపం పెరిగిపోతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇది ఫ్యూచర్ లో మీ ప్రవర్తణలలో ఎన్నో మార్పులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారాన్ని తినకపోవడం వల్ల అలసట కలుగుతుంది. ఇది మైకము, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. డ్రై ఫ్రూట్స్, పెరుగు వంటీ ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోండి.
భోజనాన్ని స్కిప్ చేస్తే మీ శరీరంలో ప్రోటీన్ల పరిమాణం తగ్గుతుంది. ప్రోటీన్ ఒక ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి. శరీర కణాలను నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుంది. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. 60 శాతం మంది పెద్దలు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తున్నారు. అలాగే భోజనాన్ని సరిగ్గా చేయడం లేదు.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రోటీన్ల లోపం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మన శరీరానికి ఆ రోజుకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. శరీర పోషణను పెంచుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అందుకే భోజనాన్ని స్కిప్ చేయకండి. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయం సమతుల్య ఆహారాన్నే తినండి.
తినకుండా ఎక్కువ సేపు ఉంటే మీ రక్తంలో చక్కెర తగ్గుతుంది. దీంతో మీ శరీరం కార్టిసాల్ ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచడమే కాకుండా మూడ్ ఆఫ్, చిరాకుకు కూడా దారిస్తుంది.
భోజనాన్ని చేయకపోవడం వల్ల వికారం, విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు కొంతమందికి మలబద్దకం సమస్య కూడా రావొచ్చు. భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్ ఇస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మరింత దెబ్బతింటుంది.
