ఓవర్ వెయిట్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక బరువు వల్ల డయాబెటీస్, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ తో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయినప్పటికీ.. కొన్ని జీవనశైలి మార్పులతో ఈ రోగాల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు బరువు ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కింది చిట్కాలను పాటించండి.
బరువు తగ్గండి
కొద్ది మొత్తంలో బరువు తగ్గినా కూడా మీ రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలపై గణనీయమైన ప్రభావం పడుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం సమస్య ఉంటే మీ శరీర బరువులో 5-10% తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
మీ బరువు కంట్రోల్ లో ఉండటానికి , అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి శారీరక శ్రమ చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిమిషాలు చురుకైన నడక వంటి మితమైన-తీవ్రత వ్యాయామాల్లో పాల్గొనండి. ఇవి మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి
ఆరోగ్యకరమైన ఆహారం బరువు తగ్గడానికి, మీ రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి మీకు బాగా సహాయపడతాయి. పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా తినాలి. ఇవి మీరు బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
ఉప్పును తగ్గించండి
ఉప్పును ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో రోజుకు 2,300 మి.గ్రా కంటే తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోండి.
ఆల్కహాల్ ను తగ్గించండి
మందులను మితిమీరి తాగితే రక్తపోటు అమాంతం పెరుగుతుంది. అలాగే శరీర బరువు కూడా పెరుగుతుంది. అందుకే రోజుకు ఒకటి నుంచి రెండు పెగ్గులకు మించి తాగకండి.
స్మోకింగ్ ను మానేయండి
స్మోకింగ్ మీ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే వీలైనంత తొందరగా స్మోకింగ్ ను మానేయండి.
తగినంత నిద్ర
నిద్ర లేకపోవడం వల్ల కూడా మీరు బరువు పెరిగే ఛాన్స్ ఉంది. ఇది అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రతి రాత్రి కనీసం 7-8 గంటల నిద్రను పోవడం లక్ష్యంగా పెట్టుకోండి.
బరువు పెరగడానికి కారణమేంటి?
జెనెటిక్స్, లైఫ్ స్టైల్, పర్యావరణ కారకాలు, ఆహారం, శారీరక శ్రమ స్థాయిలతో సహా వివిధ కారణాల వల్ల బరువు పెరుగుతారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాన్ని తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు. శుద్ధి చేసిన చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తిన్నా విపరీతంగా బరువు పెరిగిపోతారు.
