బ్లాక్ కాఫీ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా బ్లాక్ కాఫీ బాడీని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడుతుంది. అందుకే షారుఖ్ ఖాన్ బ్లాక్ కాఫీని ఇష్టంగా తాగుతారట.
ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీని పక్కాగా తాగుతుంటారు. ఈ వేడి వేడి పానీయాలు మన శరీరాన్ని ఎనర్జిటిక్ గా మారుస్తాయి. అయితే పాలు కలిపిన టీ, కాఫీ కంటే బ్లాక్ కాఫీనే ఎక్కువ ఆరోగ్యకరమైనదని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. బ్లాక్ కాఫీలో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం, చక్కెర, కార్భోహైడ్రేట్లు మొత్తమే ఉండవు. దీనిలో పొటాషియం 4 శాతం ఉంటుంది. బ్లాక్ కాఫీని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందన్న భయం లేదు. ముఖ్యంగా ఇది బరువును ఇంత కూడా పెంచదు. అందుకే షారుక్ ఖాన్ బ్లాక్ కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతుంటారట. అసలు ఈ బ్లాక్ కాఫీ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- బ్లాక్ కాఫీ జీవక్రియను బాగా పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుంది. బరువును తగ్గడానికి ప్రయత్నిస్తున్నవాళ్లు బ్లాక్ కాఫీని తాగితే కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు.
- బ్లాక్ కాఫీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా దీన్ని తాగడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతాయి.
- శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. మెంటల్ హెల్త్ బాగుంటేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ బ్లాక్ కాఫీ మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అంటువ్యాధులు, అంతర్గత మంటను తగ్గించడానికి సహాయపడతాయి.
- బ్లాక్ కాఫీ తాగే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.బ్లాక్ కాఫీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
- బ్లాక్ కాఫీ ఎన్నో వ్యాధులొచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ కాఫీని తాగే వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- బ్లాక్ కాఫీ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తాగితే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
- బ్లాక్ కాఫీ పాలు కలిపిన టీ, కాఫీల కంటే ఎంతో ఆరోగ్యకరమైనది. అలాగని దీన్ని ఎక్కువగా అస్సలు తాగకూడదు. పరిమితిలో తాగితేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే రోజుకు 4 కప్పులు తాగొచ్చు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 400 mg కంటే ఎక్కువ బ్లాక్ కాఫీని తాగకూడదు. ఇది 4 కప్పులకు సమానం. ఇంతకు మించి తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
